టిఎస్ ఎస్‌ఎస్‌సి పరీక్షలను 2020 కి గానూ మళ్లీ వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం, జూన్ 8 నుండి టిఎస్ ఎస్ఎస్సి పరీక్షలు ప్రారంభమవుతాయని భావించారు. అయితే, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లేదా జిహెచ్ఎంసి ప్రాంతంలో పరీక్షలను నిలిపివేయాలని కోర్టు తీసుకున్న నిర్ణయం తరువాత, రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తరువాతి సంవత్సరంలో నిర్వహించాలా లేదా ఈ సంవత్సరం పరీక్షలన్నింటినీ రద్దు చేసి గ్రేడింగ్ ద్వారా మార్కులు వేయాలా అని ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శనివారం రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి పరీక్షల్యు వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించడం, మరికొన్నింటిలో వాయిదా వేయడం వల్ల గందరగోళం పెరుగుతుందని, ఎక్కువ అనిశ్చితికి దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు. పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించాలని ఆయన తెలిపారు. ఒక అభ్యర్ధన మేరకు, తెలంగాణ హైకోర్టు సోమవారం నుండి కొన్ని జిల్లాలలో పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్రానికి అనుమతి ఇచ్చింది.. జిహెచ్‌ఎంసి, హైదరాబాద్, సికింద్రాబాద్, రంగా రెడ్డి జిల్లాలలో పరీక్షలు జరపవద్దని ముదుగా అనుకున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్ర రెడ్డి జిహెచ్‌ఎంసి పరిమితుల్లో పరిస్థితిని సమీక్షించి, కోర్టు ఉత్తర్వులను పరిగణ లోకి తీసుకుని పరీక్షలను వాయిదా వేయాలని, కొత్త తేదీలు నిర్ణయించాలని సూచించారు. ఎస్‌ఎస్‌సి పరీక్షలను నిర్వహించడం లేదా రద్దు చేయడంపై ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, విద్యార్థులను వారి విద్యాసంవత్సరం పనితీరు ఆధారంగా గ్రేడ్ చేయాలన్న హైకోర్టు సూచనను అమలుచేస్తూ ఈ సంవత్సరం 10 వ తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేయాలనే ఆప్షన్ ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...