దీపం పరబ్రహ్మ స్వరూపం అని అన్నారు పెద్దలు. దీపం దీప్తిని ఇస్తుంది. చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది. దీపారాధన మట్టి ప్రమిద, ఇత్తడి, వెండి, దేని లోనైనా చేయవచ్చు మరియు నూనె లేదా నెయ్యితో చెయ్యచ్చు. ముఖ్యంగా దీపారాధన చేసేటప్పుడు మనస్పూర్తిగా భక్తిశ్రద్ధలతో చెయ్యాలి. ఏ ఇంట్లో అయితే ప్రతిరోజూ ధూప, దీప, నైవేద్యాలూ జరుగుతాయో ఆ ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది అనేది సత్యం.
నిత్యం ఇంట్లో దీపం వెలిగించడం శుభప్రధం. కానీ ప్రస్తుత జీవనా విధానం లో ప్రతి రోజూ ఎవరూ దీపాన్ని వెలిగించలేరు అందుకే కార్తీక పౌర్ణమినాడు ఓ పద్ధతిని సూచించారు పెద్దలు. సంవత్సరానికి 365 రోజులు కాబట్టి రోజుకు ఒక వత్తి చొప్పున 365 ఒత్తుల్ని జత చేసి, వాటిని ఆవు నెయ్యిలో నానబెట్టి, కార్తీక పౌర్ణమి నాడు వెలిగించుతారు. దీపావళి అమవాస్య రోజు న దీపం వెలిగిస్తే యమగండం నుండి విముక్తి పొందవచ్చు అని పురాణాలు చెబుతున్నాయి.
ఇలా దీపాలు వెలిగించడం వల్ల మన ఇంట్లో ఉన్న క్రిములు పోతాయి, నయనాలకు మేలు.అందుకే పెద్దలు దీపాన్ని వెలిగించామన్నారు. కానీ ఎవరూ వినకుండా దీపం వెలిగిస్తే పుణ్యం వస్తుందా? లేకపోతే పాపం వస్తుందా అని పెద్దల మాట వినకుండా చెయ్యడం మానేశారు. కాబట్టి ఎవరూ కూడా వాళ్ళ మాటని కొట్టి పారేయకుండా విని ఈ పద్దతిని అనుసరించాలి. చక్కగా పుణ్యం మాత్రమే కాక ఇవన్నీ కూడా ప్రతీ ఒక్కరికే కలుగుతాయి. కాబట్టి దీపాన్ని వెలిగించడం ఎంతో మంచిది.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
0 Comments