వైశాఖ శుద్ధ తదియని అక్షయ తదియ అని అంటారు. ఆ పర్వదినం ప్రతి ఒక్కరూ పుణ్యకార్యం చేస్తే మంచి ఫలితం వస్తుంది. అందుకనే దీనిని అక్షయ తృతీయ అని అంటారు. అక్షయ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైందని, అదే రోజు శ్రీమహావిష్ణువు పరశురాముడిగా అవతరించాడని అంటారు. శ్రీ నారసింహుడు ప్రహ్లాదుడిని అనుగ్రహం ప్రసాదించి వేదవ్యాసుడు మహాభారత గాథను వినాయకుడికి చెప్పి రాయించుకున్నాడు. అది కూడా అక్షయ తృతీయ అని పురాణాలు చెబుతున్నాయి.
అందుకనే అక్షయ తృతీయ నాడు ప్రతి ఒక్కరూ వారి శక్తి కొలదీ సహాయం చేయడం ఎంతో మంచిది లేనివారికి సహాయం చేయడం మూగ జీవులపట్ల ఆదరణ చూపడం వంటివి చేయడం వల్ల శుభం కలుగుతుంది. అయితే అక్షయ తృతీయ నాడు ఏం చేయాలి? ఏం చేయడం వల్ల మనకి ఫలితం వస్తుంది? అయితే అక్షయ తృతీయ నాడు ఫలితం కనుక రావాలంటే ఇలా చేయాలి ఎలా అంటే.....?
శ్రీ మహాలక్ష్మి ప్రతిమ లేదా ఒక ఫోటో పెట్టి ఆ ఫోటో ముందు ఉప్పు బియ్యం పసుపు అరటి ఆకుపై పెట్టి భక్తితో పూజ చేయాలి. కర్పూర నీరాజనాలు ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పూర్వీకులు చెబుతున్నారు. అదే విధంగా ఈరోజు గోధుమలు, శెనగలు, పెరుగన్నం దానం చేస్తే మంచిదని పురాణాలు చెబుతున్నాయి.
అంతే కాకుండా వస్త్ర దానం, భూదానం, గొడుగు, పాదరక్షలు, బంగారం వంటివి దానం చేయడం వల్ల అమిత ఫలప్రదం లభిస్తుంది. ఏదైనా కొత్త పని చేయడం నూతన విద్యారంగానికి శ్రీకారం చుట్టడం మొదలైన వాటిని ఈరోజు శ్రీకారం చుట్టడం కూడా ఎంతో మంచిది. కాబట్టి వీటన్నిటినీ చక్కగా అనుసరించి ఈ పండుగ పర్వదినం నాడు ఎన్నో శుభాలను అందుకోండి.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
0 Comments