అన్నవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా, శంఖవరం మండలానికి చెందిన ప్రాంతం. అన్నవరం ఒక సుప్రసిద్ద పుణ్యక్షేత్రం. శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దివ్యక్షేత్రం. ఈ ప్రాంతంలో భక్తులతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. కార్తీకమాసం లో ఇచ్చట కనీవినీ ఎరుగని రీతిలో భక్తులు వస్తుంటారు. ఈ ఆలయం రత్నగిరి అనే కొండ పై ప్రసిద్ధి చెందినది. పొందింది. ఆలయ సమీపంలో పంపా నది పారుతుంటుంది. స్వామి వారిని దర్శించుకునేందుకు మెట్లు మార్గం ద్వారా వెళ్ళవచ్చు లేదా గుడివరకు ఘాట్ రోడ్డు నిర్మించారు.
అన్నవరంలో శ్రీ సీతారాముల వారి గుడి, వనదుర్గమ్మ గుడి, కనక దుర్గమ్మ గుడి కూడా ఈ రత్నగిరి కొండపై సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. కొండ క్రింద గ్రామ దేవత గుడి ఉంది. సత్యనారాయణ స్వామి వారిని
" మూలతో బ్రహ్మరూపాయమధ్యతశ్చ మహేశ్వరంఅధతో విష్ణురూపాయత్ర్త్యెక్య రూపాయతేనమః " అని స్తుతిస్తారు.
పురాణముల ప్రకారం అడిగిన వరాలను తీర్చే దేవుడు కాబట్టి "అన్నవరం" అని అంటారు. ఇక్కడ స్వామి వారి వ్రతం సామూహికంగా జరుపుతారు మరియు సాంప్రదాయం ప్రకారంగా శుభకార్యాలు, ముఖ్యంగా పెళ్లిళ్ళు నిర్వహిస్తారు. కొండ పైనే అన్నివసతి సౌకర్యాలు, భోజనశాల, రెస్టారెంట్లు ఇలాంటి సదుపాయాలు ఉంటాయి.
ఆలయంలో ఉదయం 6గంటల నుంచి రాత్రి 9గంటల వరకు సర్వదర్శనాలు ఉంటాయి. ఇక్కడ స్వామివారి దర్శనం అందరికీ ఉచితమే. దర్శన సమయంలో రోజూ స్వామివారికి మహానివేదన కోసం 30నిమిషాలు నివేదన, అనంతరం మళ్లీ కొనసాగిస్తారు. అన్నవరం అంటే అందరికీ గుర్తు వచ్చేది రుచికరమైన ప్రసాదం విస్తరాకులో పెడతారు.భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా జాతీయ రహదారి పై ఈ ప్రసాదాన్ని అమ్ముతారు.
0 Comments