తిరుపతి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా లో తిరుపతి ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ లో 4వ అతి పెద్ద నగరం. తిరుపతి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ప్రాచీనతకు చాలా సాహిత్య పరమైన ఆధారాలు, శాసనాధారాలు ఉన్నాయి.వేంకటేశ్వరుడు, వడ్డీ కాసుల వాడు, గోవిందుడు, ఆపద మ్రొక్కుల వాడు, శ్రీనివాసుడు, భక్తవత్సలుడు ఇలా అనేక పేర్లు ఉన్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం దేవాలయం యొక్క బాగోగులు చూడడమే కాక వివిధ సామాజిక, ధార్మిక, సాంస్కృతిక, సాహిత్య, విద్యా సంబందమైన కార్యక్రమాలను భారతదేశం నలువైపులా నిర్వహిస్తుంటుంది.
సుప్రభాత సేవ, సుద్ధి, తోమాల సేవ, కొలువు, సహస్రనామార్చన, నైవేద్యం, అష్టోత్తర శతనామార్చన, , ఏకాంత సేవ, ముత్యాల హారతి, గుడిమూసే ప్రక్రియ ఇలా అనేక విధాలుగా స్వామి వారికీ రోజు సేవలని అందిస్తారు. ప్రస్తుతం కల్యాణకట్ట ఎదురుగా ఉన్న అన్నదాన సత్రంలో 1000 మంది మాత్రమే భోజనం చేసే సౌకర్యం ఉంది.
తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ రద్దీని తట్టుకునేందుకు వరాహస్వామి అతిథిగృహం సమీపంలో రెండో అన్నదాన సత్రాన్ని నిర్మించేందుకు సమాయత్తమైంది పద్ధతి. అలాగే అన్నదానానికి గతంలో ఉన్న టోకెన్ పద్ధతిని ఎత్తివేస్తూ ఇటీవల ప్రారంభించిన సర్వభోజనం పథకం భక్తుల ప్రసంసలు అందుకుంటుంది.
మరిన్ని
0 Comments