ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో సింహాచలం అనే గ్రామంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ప్రసిద్ధి గాంచినది. ఈ దివ్యమైన క్షేత్రంలో కొలువై ఉన్న స్వామిని సింహాద్రి అప్పన్న అని కూడా పిలుస్తారు. మన ఆంధ్రాలో తిరుపతి తరువాత ఎక్కువ ఆధాయం వచ్చే క్షేత్రం సింహాచలం.ఏడాదికి 12గంటలు మాత్రమే నిజరూప దర్శనం భక్తులకు కలుగుతుంది. ఈ ప్రక్రియను చందనోత్సవం అని అంటారు, ప్రతీ వైశాఖ శుద్ధ తదియ నాడు ఈ ఉత్సవం జరుపుతారు.
నిజరూప దర్శనం అంటే చందనం తీసివేయడం. ఈ దేవాలయాన్ని మిగిలిన దేవాలయాలు తో పోల్చితే చాలా భిన్నమైనది ఎందుకంటే దేవాలయం తూర్పు ముఖంగా కాకుండా పడమర ముఖంగా ఉంటుంది. తూర్పు ముఖ ద్వారం ఐశ్వర్యమును ప్రసాదిస్తే, పడమర విజయాన్ని ప్రసాదిస్తుంది అని హిందువులు నమ్ముతారు.
దేవాలయ గర్భగుడికి ఎదురుగా కప్ప స్తంభం ఉంటుంది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రం పై ప్రతిష్ఠించబడింది. ఇది అత్యంత శక్తివంతమైనది అని భక్తుల నమ్ముతారు. సంతానం లేనివారు ఈ కప్పస్తంభమును కౌగిలించుకొంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. సింహాచలం కొండల మధ్యలో గుడి ఉంది.
సింహగిరి జలసమృద్ధి ఉన్న ప్రాంతం. ఈ కొండల పై సహజసిద్ధమైన జలధారలు ఉన్నాయి. ఇక్కడ తలనీలాలు సమర్పించిన భక్తులు స్నానాలుచేస్తారు. దేవాలయం సమీపంలో విశాలమైన గోశాల ఉంది. ఆషాఢ శుద్ధ ఛతుర్దశి రాత్రి కొండ చుట్టూ ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శించుకుంటారు. దీనినే గిరిప్రదక్షిణ అని అంటారు. ఇలా సంవత్సరం పొడవునా వివిధ ఉత్సవాలు నిర్వహించుతారు.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
0 Comments