చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరాముడు జన్మించాడు. అదే రోజున సీతా రాముల కళ్యాణం కూడా జరిగింది. అంతే కాక సీతా రాములు పద్నాలుగు సంవత్సరాలు అరణ్య వాసం, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు పట్టాభిషక్తుడు కూడా ఇదే రోజున అయ్యాడని అంటారు. అందుకే ఈ రోజుని ఎంతో గొప్పగా ఉత్సవాలని జరుపుకుంటారు. అయితే తెలంగాణ లో ఉన్న భద్రాచలం లో సీతా రాముల వారికి అతి వైభవంగా కల్యాణాన్ని జరుపుతారు. ఎక్కడెక్కడ నుండో ప్రజలు ఆ అంగ రంగ వైభవాన్ని చూడడానికి వస్తూ ఉంటారు.
అయితే ఈ శ్రీ రామ నవమి అనేది హిందువులు పండుగ. ఇళ్లల్లో ప్రజలు ఈ పండుగ నాడు పూజ చేసి సీతా రాముల విగ్రహాలని కొలుస్తారు. ఇళ్లల్లోనే వివిధ రకాల పిండివంటలతో, వడపప్పు, పానకంతో నైవేద్యం పెట్టి ఈ వేడుకని జరుపుతారు. బెల్లం, మిరియాలతో కలిపి ఈ పానకం చేస్తారు. అలానే ముందుగా పెసరపప్పుని నీళ్ళల్లో నానపెట్టాలి.
దీనిని గంట లేదా రెండు గంటల ముందే నాన పెట్టుకోవాలి. ఆ తర్వాత దానిలో ఉన్న నీళ్ళని పక్కకి తీసేసి ఆ పెసర పప్పుని తీసుకోవాలి.ఇలా చేసుకోవచ్చు.ఇది స్వామి వారికి ఎంతో ప్రీతీ. ప్రతీ ఊరులో ఉన్న సీతా రాముల ఆలయాల్లో సీతా రాముల కళ్యాణం జరుపుతారు. భక్తులు కోవెలకి వెళ్లి సీతా రాముల దర్శనం చేసుకుంటారు.
ఈ రోజు చివరన సీతా రాముల విగ్రహాలని ఊరేగిస్తారు. మహారాష్ట్రలో ఈ శ్రీ రామ నవమిని చైత్ర నవరాత్రి అంటారు. మన ఆంధ్రాలో దీనిని వసంతోత్సవం అని అంటారు. ఈ ఉత్సవాన్ని తొమ్మిది రోజులు నిర్వహిస్తారు. అనేక దేవాలయాల్లో చక్కటి వెలుగుల కాంతుల నడుమ రామాయణ పారాయణం చేస్తారు. సీతా రామ లక్ష్మణులని, హనుమంతుడిని కూడా ఈ రోజున కొలుస్తారు. ఇలా ప్రతీ శ్రీరామ నవమికి కూడా సీతా రాముల కళ్యాణంని కనుల పండుగలా జరుపుతారు.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
0 Comments