మనిషిలో ఉన్న "ఆత్మ" మనం దేవుని గురించి ఆలోచించేలా ప్రేరణ కలిగిస్తుంది.. ఆత్మ లేని చోట ప్రాణం ఉండదు, ప్రాణం లేని వాటిని వస్తువులుగా పరిగనిస్తాము.. వస్తువులకు దేవుడితో ఎటువంటి అనుభందం ఉండదు..
కానీ దేవుడిని అర్ధం చేసుకోవడం, దేవుడి నుండి వరాలు పొందడం అంత సులభం కాదు.. మరి దీనికి పరిష్కారం ఏమిటి?
మొదట భగవంతుడిని తెలుసుకోవడం ఖచ్చితంగా సాధ్యమే.. ఈ ప్రపంచం లో అనేకమంది దేవున్ని తెలుసుకున్నారు.. అదే విధంగా శాశ్వతమైన ఆనందాన్ని పొందారు. అందువల్ల మొదట దేవుడు వరాలు కురిపిస్తాడా లేదా అనే భయం మనకు అవసరం లేదు...
మనం ఏపని లో అయినా "ప్రయత్నం" చేయడంతో పాటూ దేవుడి వరం కూడా పొందడం తప్పనిసరి. దేవుడు వరం ఇవ్వడం ద్వారా మనకు సంపూర్ణ సంతోషం ఎల్లవేళలా కలుగుతుంది.. శ్రీ కృష్ణుడు తన కృప ద్వారా అర్జునుడికి శాశ్వతమైన ఆనందాన్ని కలిగించాడు.. ఇదే విషయాన్ని శ్రీమద్ భాగవతం, భగవద్గీత, రామాయణం మరియు ఇతర గ్రంథాలు కూడా చెబుతున్నాయి.
దేవుడు వరాలను ప్రసాదించినప్పుడు, మన ఇంద్రియాలు, మనస్సు మరియు తెలివితేటలు ఆ దేవుడి శక్తితో ప్రకాశిస్తాయి. ఆ శక్తితో, మనం ఆయనను చూడగలుగుతాము, ఆయనను వినగలుగుతాము, ఆయనను తెలుసుకోగలుగుతాము... దేవుడి దయ పొందిన ఆ అదృష్ట ఆత్మలు "యోగులు" గా మారతారు..
ఈ సూత్రాన్ని అర్థం చేసుకున్నప్పుడు, మనకి సహజంగా ఒక ప్రశ్న తలెత్తుతుంది: భగవంతుని సాక్షాత్కారం అతడి దయపైనే ఆధారపడి ఉంటే, అప్పుడు మనం సొంతంగా దేవుడి దయ కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏముంది? అంటే, ఖచ్చితంగా అవసరం ఉంది అని చెప్పాలి.. "చప్పట్లు వినడానికి, మీ రెండు చేతులు కావాలి".. భగవంతుడు తన దయను మనపై ఖచ్చితంగా ప్రసాదిస్తాడు... కానీ ఆ కృపను స్వీకరించడానికి మొదట మనం అర్హులం అయి ఉండాలి.. ఆ అర్హత సాధించడానికి మనం స్వయంగా ప్రయత్నం చేయాలి.
భౌతిక ప్రపంచంలో కూడా, ఏదైనా లక్ష్యాన్ని సాధించడానికి, మనం దానికి అర్హులమా కాదా అనేది చూసుకోవాలి లేదా దానికి అర్హత సాధించాలి. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఏదైనా సబ్జెక్టులో పీహెచ్‌డీ చేయాలనుకుంటే, అతను మొదట అదే సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. ఒక ఉన్నత పాఠశాల విద్యార్థి పీహెచ్‌డీ కావాలనే లక్ష్యంతో విశ్వవిద్యాలయంలోకి వెళ్లలేడు.
అదేవిధంగా, దేవుని అనంతమైన దయ పొందటానికి, మనకు ఒక అర్హత ఉండాలి.
చాలా మంది భగవంతుని దయ గురించి తప్పుగా అర్ధం చేసుకుంటారు.. "నా తలరాత ఇలా ఉంది" అని ఒక సాకు చూపుతూ దేవుని దయను పొందడానికి ప్రయత్నం చేయకుండా ఆగిపోతారు.. గ్రంథాలలో చాలా స్పష్టంగా ఉంది. ఒకరు నిజమైన ఆనందాన్ని పొందాలనుకుంటే, అతను దేవుణ్ణి తెలుసుకొని ఆ దేవుడిని చేరుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేయాలి. లేని పక్షం లో, భౌతిక ఆనందం కోసం ఈ విలువైన మానవ జీవితాన్ని వృధా చేయడం ద్వారా కలిగే పరిణామాలను భవిష్యత్తులో అనుభవించాల్సి ఉంటుంది.
భగవంతుడు ఎంతో దయగలవాడు, మరియు ఆయన తన వరాలను మనపై ప్రసాదించడానికి ఎదురు చూస్తూ ఉంటాడు, కాని దానికి మనము తయారుగా ఉన్నప్పుడే ఆయన అలా చేయగలడు. మీరు కారుతున్న పాత్రతో ఒక పాల వాడి వద్దకు వెళ్లి పాలు అడిగితే, ఆ పాలవాడు ఇలా అంటాడు, “నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ మీరు తెచ్చిన పాత్ర సరిగా లేదు.. సరైన పాత్రను తీసుకురండి, అప్పుడు పాలు పోస్తాను." అంటాడు..
మనకు అవసరమైన ఆ పాత్ర ఏమిటి? దేవుణ్ణి తెలుసుకోవటానికి మనం చేయాల్సిన పనులేంటి?
మానవుడు తనతో కలిగి ఉన్న అతి ముఖ్యమైన మరియు విలువైన వస్తువు మనస్సు. బుద్ధి యొక్క ఆదేశం ప్రకారం పనిచేయగలది ఈ "మనస్సు". తెలివి కూడా మనస్సులో ఒక భాగం కాబట్టి మనస్సు మరియు తెలివి రెండింటినీ కలిపి 'మనస్సు' అని పిలుస్తారు.
మనస్సు సరైన దిశలో కదులుతుంటే, భగవంతుని సాక్షాత్కారంతో సహా ఏదైనా సాధ్యమే. మనస్సును తప్పుదారి పట్టించినట్లయితే, ఆ వ్యక్తి భయంకరమైన కార్యాలు చేస్తాడు..
భగవంతుని గురించి నిజమైన మరియు సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందడం మరియు మనస్సును దేవుని వైపు నడిపించడం ప్రతి ఆత్మ యొక్క విధి. మిగిలినవి దేవుడు మరియు అతడి గురువులు పూర్తి చేస్తారు.
భగవంతుని దయ పొందటానికి మానవుడు పొందవలసిన "అర్హత" నే సరెండర్ అని పిలుస్తారు.. మీరు దేవుడికి సరెండర్ కావాలంటే ఆ దేవుడికి ఇదివరకే సరెండర్ కాబడిన ఒక గురువు సహాయం మీరు తీసుకోవాలి..
ఈ విషయాలు అర్ధం చేసుకుని ఆచరిస్తే మీరూ ఎళ్ళవేళలా సంతోషంగా ఉండగలరు.. అదే సమయం లో దేవుడు ఇచ్చే వరాలు స్వీకరించి జీవితం లో ఉన్నత శిఖరాలు అధిరోహించగలరు..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
0 Comments