విజయవాడ పేరు వినగానే గుర్తు వచ్చేది కనకదుర్గమ్మ ఆలయం. అమ్మవారు కనకవర్ణ శోభితురాలై వుండటం వల్ల అమ్మవారికి కనకదుర్గ అనే పేరు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. ఈ ఆలయం కృష్ణా నది ఒడ్డున ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పై ఉంది. ఈ ఆలయంలోని అమ్మవారి విగ్రహం నాలుగు అడుగులు మరియు ఆంధ్రప్రదేశ్ లో ఎత్తైన గాలిగోపురం ఉన్న దేవాలయం. అంతేగాక స్త్రీ శక్తి పీఠాలలో ఈ ఆలయం ఒకటి. ఇక్కడి అమ్మవారు స్వయంభువుగా వెలిసారు అని క్షేత్ర పురాణాలు చెప్తున్నాయి.
ఇక్కడకి దసరా నవరాత్రులకు భక్తులు తండోపతండాలుగా వస్తారు. తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలతో అమ్మవారు కనపడతారు. మొదటి రోజు బాల త్రిపుర సుందరి,రెండవ రోజు గాయత్రీ దేవి,మూడవరోజు అన్నపూర్ణాదేవి, నాలుగవ రోజు లలితా త్రిపుర సుందరి,ఐదవ రోజు సరస్వతీ దేవి,ఆరవ రోజు దుర్గాదేవి,ఎడొవ రోజు మహాలక్ష్మీ దేవి,ఎనిమిదొవ రోజు మహిషాసురమర్దిని దేవి,తొమ్మిదొవ రోజు రాజరాజేశ్వరీ దేవి.
ఐదవ రోజు అమ్మవారి జన్మనక్షత్రం అనగా మూలా నక్షత్రం ఆ రోజు విద్యార్థులు తరలివస్తారు. ప్రతి ఆషాఢ మాసంలో శాకాంబరీ దేవి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు మూడు రోజులు జరుపుతారు. భక్తులు వ్యవసాయ ఉత్పత్తులు బాగా రావాలి అని కోరుతారు. అలాగే తెప్పోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఉత్సవాల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేస్తారు.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
0 Comments