శ్రీ కాళహస్తి ఆంధ్ర రాష్ట్రంలో చిత్తూర్ జిల్లాలో ఒక మండలం. సర్వముఖి అనే నది ఒడ్డున ఈ ఆలయం వుంది. ఈ ప్రాచీనమైన ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇక్కడ ఎత్తైన గాలి గోపురం వుంది. ఈ గాలి గోపురం శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది. ఈ కాళహస్తీ కళంకారీ కళకి బాగా ప్రసిద్ధి. సువర్ణ ముఖి నది తీరాన్న ఈ స్వామి స్వయంభువుగా వెలిసారు. అలానే ఈ కాళహస్తిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు.
పురాణాల ప్రకారం ఈ క్షేత్రం లోనే బ్రహ్మ కి జ్ఞానం కలిగింది అని అంటారు. అలానే వశిష్టుడు, సాలె పురుగు, పాము, ఏనుగు, బోయడు అయిన తిన్నడు వేశ్య కన్యలు, యాదవ రాజు వంటి కధలు ఈ క్షత్రం మహత్యం లో పెనవేసుకున్నాయి. ఈ క్షత్రం దేశం లో అతి పెద్ద దేవాలయాల్లో ఒకటి. ఇక్కడకి అనేక మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి తరలి వస్తారు.
వివిధ పండుగలని కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుతారు. శివరాత్రి కి ఇక్కడ బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు నిర్వహిస్తారు. అలానే ఇక్కడ వీధుల్లో కూడా నిర్వహించడం వల్ల జనం కిటకిటలాడుతూ కనిపిస్తారు.
అలానే ఇక్కడ వల్లే కాకుండా పక్క రాష్ట్రాలు అయిన తమిళ్ నాడు, కర్ణాటక నుండి కూడా అనేక మంది వస్తారు. ఈ మహోత్సవాలకు ముఖ్య ప్రముఖులు కూడా ఇక్కడకి వచ్చి పాల్గొంటారు.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
0 Comments