కుశధ్వజుడు కి శ్రీ మహాలక్ష్మి వేదవతి గా జన్మించింది. శంభుడనే అసురుడు ఇతని గృహానికి వచ్చి వేదవతి ని చూసి మోహించి కుశధ్వజడుని అడగగా అతడు నిరాకరించాడు. అర్ధరాత్రి సమయం లో శంభుడు కుశధ్వజుడ్ని వధించగా వేదవతి చూపులకు శంభుడు భస్మమయ్యాడు.
వేదవతి విష్ణువుని భర్తగా పొందాలని ఘోర తపస్సు చేసింది. అలా చేస్తుండగా పుష్పక విమానం లో వస్తున్న రావణుడు ఈమెని చూసి మోహించి ఆమె జుట్టు పట్టుకుని తీసుకుపోగా ఆమె భస్మం అయ్యింది.
భస్మాన్ని ఇతడు ఓ పెట్టెలో పెట్టుకుని లంకకు తీసుకు వెళ్ళిపోయి మండోదరికి ఇచ్చాడు. తెరిచి చూడగా ఓ బాలిక కనిపించింది. అసురుల గురువైన శుక్రుడు సలహా పై ఆ బాలిక లంక లో ఉండడం అరిష్టం అని భావించి తన సేవకుల తో ఆ పెట్టెని సముద్రం లోకి విసిరి వేయగా కొట్టుకొని వచ్చి మిధిలా నగరం లోని భూమి లో ఉండిపోయింది.
జనక రాజు యాగానికి ఆ స్థలాన్ని అనువైనదని ఎంచి దున్నుకోగా ఈ పెట్ట దొరికింది. అందులోని పాపను చూసి తన భవనానికి తీసుకు వెళ్లి సీత గా నామకరణం చేసి తన కూతురుగా పెంచాడు. ఇది దేవీభాగవతం చెబుతోంది.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
0 Comments