వాల్మీకి ఒక ఋషి. కవుల్లో మొదటివాడు. రామాయణ గ్రంథకర్త . ఇతడు వరుణుడి పదవ కుమారుడు అని పురాణాలు చెబుతున్నాయి. ప్రచేతసుడి కొడుకని, వరుణుడి కొడుకని ఉత్తర రామాయణం చెబుతోంది. బ్రహ్మ శాపం వల్ల బోయవాడిని రామాయణం చెబుతోంది. మొదట ఇతడు దుర్మార్గుల తో స్నేహం చేసి దుర్మార్గం గానే జీవించాడు అప్పుడు అతని పేరు వాల్మీకి కాదు.
ఇతడు సంతానాన్ని పోషించడానికి యాత్రికులని దోపిడీ చేసే వాడు. ఒకసారి సప్తరుషులని పట్టుకున్నాడు. సప్త ఋషులు నీవు చేసే పాపాలు నీ భార్య పిల్లలు పంచుకుంటారేమో అడుగు అని చెప్పగా అతడు వెంటనే ఇంటికి వెళ్లి భార్యను పిల్లల్ని అడగగా వారు నిరాకరించడం తో అతని జీవితం ఒక్కసారిగా మారి పోయింది.
అతడు వెంటనే సప్తరుషుల పాదాలపై పడగా అతనికి వేద జ్ఞానం బోధించారు. వెంటనే అతని నోట వెంట రామా రామా వచ్చాయి. అలాగే తపస్సు చేశాడు. ఆ తపస్సు లో ఉండగానే అతడి చుట్టూ చీమలు పుట్ట పెరిగింది.
అలాగే ఉండగా సప్తరుషులు తిరిగి వస్తూ ఆ పుట్టను తవ్వి ఇతడిని పైకి తీశారు. వాల్మీకం నుండి బయటకి వచ్చాడు కనుక ఇతడు వాల్మీకి గా ప్రసిద్ధుడయ్యాడు. తమసా నదీ తీరాన ఆశ్రమం ఏర్పరుచుకుని తన శిష్యులతో జీవించాడు. ఇక్కడ ఇతడు రామాయణం రచించాడు.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
0 Comments