ఊర్మిళ జనక మహారాజు కూతురు అంటే సీత చెల్లెలు. రాముడు శివ ధనుస్సుని విరిచాక సీత తో పెళ్లి నిర్ణయించారు. సీత సోదరీమణులు ని రాముడు సోదరులకు ఇచ్చి వివాహం జరిపించారు. అంటే లక్ష్మణుడిని ఊర్మిళ కిచ్చి వివాహం చేశారు.
రామ లక్ష్మణుల వనవాస సమయంలో ఈమె నిద్రలో ఉంది. ఈమె వల్ల లక్ష్మణుడికి ఇద్దరు కుమారులు జన్మించారు. మొదటి వాడు తక్షకుడు, రెండవ వాడు ఛత్రకేతుడు. మొదటివాడు తూర్పు దిక్కున అగతి అనే పతనాన్ని నిర్మించుకుని రాజ్యమేలాడు.
రెండవ వాడు పశ్చిమ దిక్కున చంద్రమతి నగరాన్ని నిర్మించుకుని రాజ్యమేలాడు. రాముడి శిక్షకు గురై లక్ష్మణుడు సరస్వతీ నది లో మునిగి మరణించిన తర్వాత ఊర్మిళ అగ్ని ప్రవేశం చేసి స్వర్గానికి చేరుతుంది.
అయితే ఊర్మిళ లో చెప్పుకోవాల్సింది ఊర్మిళాదేవి నిద్ర. రాముడు తో పాటు లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్తే ఊర్మిళా దేవి అన్ని సంవత్సరాలు కూడా నిద్ర చేస్తుంది. దీన్నే ఊర్మిళాదేవి నిద్ర అని పాఠాలు కింద కూడా వచ్చాయి.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
0 Comments