స్మార్ట్ ఫోన్లు వినియోగం పెరిగిన క్రమంలో మనిషి తన సొంత బ్రెయిన్ తో ఆలోచించడం పూర్తిగా మర్చిపోయాడు.ఇక ఆండ్రాయిడ్ వచ్చాక పరిస్థితి మరింత దారణంగా తయారు అయ్యింది. కనీసం బుర్రపెట్టి ఆలోచించకుండా అది ఏం చెబితే.. అదే నిజమని నమ్మేస్తున్నారు.ఇక గూగుల్ మ్యాప్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చాలా మంది కనీసం అడ్రస్‌లు కూడా గుర్తుపెట్టుకోకుండా బ్లైండ్ గా గూగుల్ మ్యాప్స్ ని ఫాలో అవుతున్నారు. తాజగా అమెరికాలో జరిగిన ఈ చిత్రమైన ఘటనే అందుకు నిదర్శనం.
మిన్నియాపాలిస్‌లో ఓ యువకుడు నదికి అవతల ఉన్న ఓ ప్రాంతానికి వెళ్లేందుకు గూగుల్ మ్యాప్స్ ని యూస్ చేస్తున్నాడు. అది చూపించిన దారిలో నడుస్తూ నేరుగా గడ్డకట్టిన మిస్సిస్సిపీ నదిలోకి వెళ్లాడు. మంచు ముక్కలు కావడంతో నదిలో కొంత వరుకు మునిగిపోయాడు. అటుగా వెళ్తున్న కొందరు అతడిని రక్షించే ప్రయత్నం చేశారు. సాధ్యం కాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరిన రెస్క్యూ టీమ్ అతడిని రక్షించి హాస్పిటల్‌కు తరలించారు.
గూగుల్ మ్యాప్‌లో చూపించిన దారిలో నడవడం వల్లే తాను నదిలో చిక్కుకున్నానని బాధితుడు తెలిపాడు. ‘సీబీసీ’ వార్తా సంస్థ కథనం ప్రకారం.. వాస్తవానికి అతడు గమ్యం చేరాలంటే.. స్టోన్ ఆర్క్ బ్రిడ్జ్‌ను దాటాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా గూగుల్ అతడిని నదిని దాటి వెళ్లాలని చెప్పిందే గానీ, నదిలో నుంచి వెళ్లమని చెప్పలేదని.. అతడు పొరపాటును ఆ మార్గంలో వెళ్లి ఉంటాడని పేర్కొంది.
5జీ వార్.. పోటీ పడుతున్న మూడు కంపెనీలు.. ఔట్ కానున్న చైనా కంపెనీ? 5జీ వస్తే ఏమవుతుంది? అనారోగ్య సమస్యలు తప్పవా? సంచలనం స్రుష్టిస్తున్న తాజా వ...
అమెరికా లో జాబ్ వదిలేశాడు.. ఇండియా తిరిగి వచ్చి బిలియన్ డాలర్ కంపెనీ స్రుష్టించాడు.. ఎలా? ఏంటా బిజినెస్? ఇంతకీ ఎవరతడు? ఎందుకు అంత సాహసం చేశాడు? ఇలాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. "పీయూష్ బన్సాల్"...
0 Comments