2020 లో బిజినెస్ ఎలా చెయ్యాలి? 'లెన్స్ కార్ట్' సక్సెస్ స్టోరీ సీక్రెట్స్..

img

అమెరికా లో జాబ్ వదిలేశాడు.. ఇండియా తిరిగి వచ్చి బిలియన్ డాలర్ కంపెనీ స్రుష్టించాడు.. ఎలా? ఏంటా బిజినెస్? ఇంతకీ ఎవరతడు? ఎందుకు అంత సాహసం చేశాడు? ఇలాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

"పీయూష్ బన్సాల్" .. 2010 లో లెన్స్ కార్ట్ అనే కళ్ళజోల్ల వ్యాపారం స్థాపించి "ఎలైట్ యూనికార్న్ క్లబ్" లో చోటు దక్కించుకున్న సంస్థకు అధిపతిగా నిలిచాడు..

అమెరికాలో జాబ్ చేస్తున్న ఈ ఢిల్లీ యువకుడు కెనడాలోని మెక్ గిల్ యూనివర్సిటీలో చదువు పూర్తిచేశాడు.. . ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసుకున్న తరువాత అతడు టెక్నాలజీ దిగ్గజం అయిన మైక్రోసాఫ్ట్ సంస్థలో జాబ్ పట్టేశాడు.

బిల్  గేట్స్ ని ఆదర్శంగా తీసుకున్న పీయూష్ తన వ్రుత్తిలో ఉన్నత స్థాయి ఉద్యోగం లో భాగంగా "మైక్రోసాఫ్ట్ ఆఫీస్" సాఫ్ట్ వేర్ ను యూజర్స్ ని మరింత ఆకట్టుకునేలా చెయ్యడం లో భాగంగా తన ప్రతిభను కనబరిచాడు..

అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి పీయూష్ కి ఒక ఆలోచన వచ్చింది.. సొంతంగా ఏదైనా చేయాలి అని మనసులో అనుకున్నాడు.. సహజంగానే కొంచం తెలివైన యువకుల లాగానే అతడూ ఆలోచించాడు.. 2007 చివర లో తన జాబ్ కి రిజైన్ చేసి డిల్లీ చేరుకున్నాడు..  2007 నుండి 2009 వరకు ప్రపంచమంతా అతి పెద్ద రిసెసన్ పీరియడ్ ని ఎదుర్కొంది.. ఎంతో మంది తన స్నేహితులు, భంధువులు అతడి నిర్ణయాన్ని వ్యతిరేకించారు.. కానీ పీయూష్ రిసెషన్ కన్నా పెద్ద సమస్యలను సాల్వ్ చెయ్యాలనే పట్టుదల, నమ్మకం కలిగి ఉండడం తో అది పెద్ద సమస్య కాలేదు.. అతడు ఆ పరిస్థితికి ఏమాత్రం భయపడలేదు.. ఇక మైక్రోసాఫ్ట్ లో ఎన్నో కష్టతరమైన ప్రాజెక్ట్ లోని సమస్యలకు సులువుగా పరిష్కారం కనుగొని యూజర్స్ మన్ననలను పొందినప్పటికీ ఆ విజయం అతడికి చాలా చిన్నదిగా అనిపించింది.. అందుకే పీయూష్ కొత్త ఆశలతో, ఆశయాలతో ఢిల్లీ బయలుదేరాడు..

2007 నుండి 2009 మధ్య కాలం లో రెండు మూడు స్టార్టప్ కంపెనీలలో పీయూష్ అడుగుపెట్టి వాటిని విజయం వైపు నడిపించాడు.. అదే సమయం లో ఐ ఐ యం బెంగుళూరు నుండి "మేనేజ్ మెంట్ డిప్లొమా ఇన్ ఎంటర్ ప్రొన్యూర్ షిప్" లో పట్టా సాధించాడు..

ఇక బెంగుళూర్ లో చదువు పూర్తికాగానే అతడి చూపు కళ్ళజోడు వ్యాపారం పై పడింది.. అప్పుడే లెన్స్ కార్ట్ కు అంకురార్పణ జరిగింది.. నవంబర్ 2010 లో ఈ సంస్థ ద్వారా ఆన్ లైన్ లో కాంటాక్ట్ లెన్స్ లను అమ్మడం మొదలు పెట్టాడు.. మార్చ్ 2011 నాటికి ఢిల్లి లోని ణ్ఛృ బసెద్ స్తర్త్ ఉప్ ద్వారా ఐ గ్లాసెస్, సన్ గ్లాసెస్ అమ్మకాలు తమ సంస్థ ద్వారా జోరందుకున్నాయి..

నేడు పదేళ్ళ తర్వాత భారత స్టార్ట్ అప్ విభాగం లో అతిపెద్ద జియాంట్ కంపెనీ గా అవతరించి 1 బిలియన్ డాలర్ల కంపెనీ గా లెన్స్ కార్ట్ అవతరించింది..

మొదట్లో ఇది ఆన్ లైన్ స్టోర్ గానే సేవలందించినప్పటికీ దేశ వ్యాప్తంగా 600 రిటెయిల్ స్టోర్స్ ఓపెన్ చేసి ఇంకా తన పరిధిని విస్తరించే పనిలో ఉంది..

"నేను ఈ కంపెనీ మొదలు పెట్టినప్పుడు ఒక ఆశయంతో మాత్రమే మొదలుపెట్టాను.. కానీ ఇంతపెద్ద సక్సెస్ సాధిస్తానని ఎన్నడూ ఊహించలేదు.." అని అంటాడు పీయూష్.. అందుకేనేమో మొదట్లో చిన్న చిన్న ఇన్వెస్టర్లు ఈజీగా మాకు పెట్టుబడులు ఇచ్చి ప్రోత్సహించారు.. వారిని ఒప్పించడానికి మాకు పెద్ద కష్టం కూడా కలగలేదు..  అయితే ఇప్పుడున్నంత సైజ్ లో కంపెనీ అవతరిస్తుందని ఆనాడు ఇన్వెస్టర్లుగానీ మేము గానీ ఊహించనే లేదు అంటాడతను.. జపాన్ కు చెందిన సాఫ్ట్ బ్యాంక్ 275 మిలియన్ డాలర్లు 2019 డిసెంబర్ లో లెన్స్ కార్ట్ లో పెట్టుబడిగా పెట్టింది.. విజన్ ఫండ్ -2 ద్వారా మషయోషి కుమారుడు ఈ పెట్టుబడులు పెట్టాడు.. అనేక సార్లు చర్చలు జరిగిన తర్వాత ఆ డీల్ క్లోజ్ అయ్యింది.. దీంతో పాత ఇన్వెస్టర్లు కొందరు తమ పెట్టుబడులను కొంత ఉపసమ్హరించుకున్నారు..

 

TPG Group, PremjiInvest and International Finance Corp లు మొదటినుండీ పెట్టుబడులు పెట్టాయి.. 2020 మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ కి గానూ తమ సేల్స్ 1000 కోట్లు గా నమోదు చేసింది.. ఇది 2019 లో 500 కోట్లు నమోదయింది..

పీయూష్ అనుకున్న దాని ప్రకారం ఇది భారతదేశం లో అనేక మంది తమ చూపు లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్లాన్ వేశాడు. భారత్ లో 50 కోట్ల మంది కి కంటి చూపు సమస్యలు ఉన్నాయి... ప్రపంచ జనాభాలొ 40 శాతం మంది కంటి సమస్య తో బాధపడే వారు భారత్ లోనే నివసిస్తున్నారు.. అయితే అందులో 2 కోట్ల మంది మాత్రమే ప్రస్తుతం ఐ గ్లాసెస్ వాడుతున్నారు.. ఈ సంఖ్యలే పీయూష్ ని లెన్స్ కార్ట్ స్థాపించడం వైపు పురిగొల్పాయి..

పదేళ్ళ క్రితమే ఈ సమస్యను పసిగట్టిన పీయూష్ అప్పటినుండి ఇప్పటివరకు కొన్ని మిలియన్ల మందికి తన బ్రాండ్ ద్వారా కంటిచూపు మెరుగయ్యేలా చెయ్యగలిగాడు..  అయితే చాలామంది మనదేశం లో దీన్ని ఒక మెడికల్ సమస్యగా భావించి గ్లాసెస్ వాడడానికి మొహమాటాపడతారు.. కానీ వీటిని ఒక ఫ్యాషన్ వేర్ లా అలవాటు చెయ్యగలిగితే మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది అని అతడి అభిప్రాయం..

లెన్స్ కార్ట్ సంస్థ తన మార్కెట్ ను విస్తరించుకునే చర్యలో భాగంగా ప్రజలకు కంటి సమస్యపై అవగాహన, పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తుంది.. ఒక్క రోజులో 15,000 పరీక్షలు లెన్స్ కార్ట్ సంస్థ ద్వారా ప్రజలకు సేవలందిస్తుంది..

లెన్స్ కార్ట్ ముందున్న మరో సవాల్.. ఐ గ్లాసెస్ సామాన్యుడికి అందుబాటులోకి తేవడం, అదే సమయం లో ఫ్యాషన్ గా కూడా ఉండేలా చూసుకోవడం ..

35 ఏళ్ళ పీయూష్ ఈ మూడు అంశాలమీద ద్రుష్టి పెడుతూనే మరింతమందికి ఈ విషయం పై అవగాహన కల్పించాలని తార్గెట్ పెట్టుకున్నాడు..

నీ సక్సెస్ మంత్ర ఏంటని అడిగినప్పుడు పీయూష్ సమాధానమిస్తూ "ప్రజలకు దీని అవసరం ఉందనే ఆశక్తి క్రియేట్ చెయ్యడం తో పాటూ, ఉద్యోగులకు మంచి సదుపాయాలు అందిస్తూ, క్వాలిటీలో రాజీ పడకుండా ఉండడం అనే మూడు అంశాల మిళితమే లెన్స్ కార్ట్ సక్సెస్ కి ప్రధాన సూత్రాలు " అంటాడు..

మార్కెట్ లో ఇతర పోటీదారుల గురించి ఎక్కువ ఆలోచన లేదు.. మా కష్టమర్ల కు ఏది అందిస్తే సంతోషిస్తాడు అనేదానిపైనే ఎక్కువ ద్రుష్టి పెడతాము.. కస్టమర్ ఊహించిన దానికంటే 10 నుండి 20 రెట్లు సంత్రుప్తి చెందేలా చేయడమే లక్ష్యం గా పెట్టుకుంటాము.. అనేది పీయూష్ అభిప్రాయం..

పట్టుదల, శక్తి ఉన్న యువతకు తన కంపెనీలో చోటుకల్పించడం ద్వారా మంచి ఆరోగ్యకరమైన, ఉత్సాహ భరితమైన ఆఫీస్ ఎన్విరాన్ మెంట్ క్రియేట్ చేస్తాను.. దీంతో ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుంది అని అతడి అభిప్రాయం..

నిజానికి ఒక కొత్త ఐడియా ను టెస్ట్ చెయ్యడానికి కొన్ని సంస్థలు అనేక నెలలపాటూ సమయం తీసుకుంటూ ఉంటారు. కానీ లెన్స్ కార్ట్ లో అలా కాదు.. " trying fast and failing fast" అనే సూత్రాన్ని పాటిస్తారు..

స్టోర్స్ ఓపెన్ చేసేటప్పుడు "మేము స్టోర్ ఓపెన్ చేశాక ఏ ఇతర ఆన్ లైన్ సంస్థ కూడా తమ స్టోర్ లను ఓపెన్ చెయ్యడానికి ముందుకు రాకూడదు " అనే గోల్ ని సెట్ చేసుకుని క్వాలిటీ, ధర, సర్వీస్ విషయం లో అంత పక్కా ప్లాన్ చేశాడు.. దీంతో ఇతర సంస్థలు వెనకడుగు వేశాయి..

ప్యాండెమిక్ లో కూడా తమ వ్యాపారం నిలదొక్కుకోవడమే కాకుండా సేల్స్ లో 70 శాతం పెరుగుదల కనిపించింది అని అంటున్నాడు లెన్స్ కార్ట్ అధినేత పీయూష్..

భవిష్యత్తులో మరింత మందికి చేరువై సరికొత్త టార్గెట్స్ రీచ్ కావడమే తమ ముందున్న కర్తవ్యం అని ఈ యంగ్ ఎంటర్ ప్రొన్యూర్ చెప్పుకొస్తున్నాడు..  

చూశారుగా.. మార్కెట్ లో దేనికైతే డిమ్యాండ్ ఉందో ఆ బిజినెస్ ని పట్టుకుని నిబద్దతతో, పక్కా ప్లాన్ తో, ఆత్మ విశ్వాసం తో ప్రయత్నిస్తే విజయం తధ్యం అని లెన్స్ కార్ట్ నిరూపించింది.. ఈ సక్సెస్ స్టోరీ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో తెలియజేయండి...   

మరిన్ని

Comments

0 Comments

సాంకేతికం

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()