ఆన్లైన్ లో ఫ్రీ గా మూవీస్ వస్తున్నాయి అని చూస్తున్నారా ! అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే. ప్రస్తుతం మూవీస్ చూడాలి అంటే ఏ హాట్ స్టార్ వైపో లేక అమెజాన్ ప్రైమ్ వైపు అందురు చూస్తూవుంటే కొందరు మాత్రం పైరసీ మూవీస్ లింక్స్ కోసం ఇంటర్నెట్ లో తెగ వెతకటం మొదలు పెడతారు. ఇక కొత్త సినిమాలు విడుదల అయ్యాయి అంటే పైరసీ వెబ్ సైట్స్ హడావిడి తార స్థాయిలో ఉంటుంది. ఓటీటీ ప్లాట్ ఫాంల్లో సినిమాలు ఉన్నపటికీ డబ్బులు ఎందుకు దండగ అని పైరసీ వెబ్ సైట్స్ లో సినిమాలుని డౌన్లోడ్ చేస్తువుంటారు కొందరు కంత్రి గాళ్ళు. తాజాగా విడుదలై, ఆస్కార్ విజేతగా నిలిచినా జోకర్ మూవీ గురించి తెలియనివారు ఎవరు ఉండరు. ఈ సినిమా గురించి సెర్చ్ చేయని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ సినిమాను పైరసీని అస్సలు డౌన్ లోడ్ చేయవద్దంటున్నారు టెక్ నిపుణులు.
సమస్య ఏంటి ?
తాజాగా ఆస్కార్ బరిలో నిలిచిన మూవీస్ చూడడానికి ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ పాయింట్ నే క్యాష్ చేసుకుందాం అని సైబర్ క్రిమినల్స్ రెడీగా ఉన్నారు అని తెలుస్తుంది. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పెర్ స్కీ ఇంటర్నెట్ యూజర్స్ హెచ్చరిక జారీచేసింది.
ఫోర్బ్స్ కథనం ప్రకారం : ఆస్కార్ కు నామినేట్ అయిన సినిమాలకు సంబంధించిన పైరసీ సైట్లలో ఉన్న లింకులలో మాల్ వేర్ లింక్స్ కలిగి ఉన్న 925 లింకులను కాస్పెర్ స్కీకు చెందిన కంపెనీ తాజాగా కనుక్కున్నారు. వీటిలో జోకరే కాకుండా ఇంకా మరిన్ని సినిమాలు ఉన్నాయి అని తెలుస్తుంది.
జోకర్ తో జాగ్రత్త :
కాస్పెర్ స్కీ కనుకున్నా 925 లింకులలో జోకర్ సినిమాకు సంబంధించినవే 304 లింకులు వున్నాయి అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందొ మనం అర్ధం చేసుకోవచ్చు. ఈ సంభందించిన ఎటువంటి లింక్స్ పైన క్లిక్ చేయకపోవడమే మంచిది. ఇప్పటికే డౌన్లోడ్ చేస్తే మీ డివైస్ ని యాంటీ వైరస్ సహాయంతో స్కాన్ చేయండి. ఎందుకంటే ఒక్కసారి మన ఫోన్లలోకి, కంప్యూటర్లలోకి మాల్ వేర్ వచ్చిందంటే.. మన వ్యక్తిగత సమాచారం మొత్తం హ్యాకర్లు చేతికి వెళ్ళిపోయినట్టే మరి.
1917 కూడా ప్రమాదం అంచుల్లో :
మూవీ లవర్స్ లో గత కొంత కాలంగా వినిపిస్తున్న మరో పేరు 1917. అయితే ఈ మూవీకి చెందిన పైరసీ లింకుల్లో కూడా మాల్ వేర్ ఉన్నట్లు టెక్ నిపుణలు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ 925 లింకుల్లో 1917కు చెందిన లింకులు ఈ మూవీ లింక్స్ 215 ఉన్నాయి.కాబట్టి ఈ సినిమాను కూడా నెట్ లో డౌన్ లోడ్ చేసుకునేటప్పుడు కొంచం జాగ్రత్తగా ఉండాలి అని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు .
నెట్ ఫ్లిక్స్ కూడా మాయే :
ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో రన్ అవుతున్నా ఐరిష్ మ్యాన్ మూవీ మూవీ లింక్ లో కూడా హ్యాకర్లు మాల్ వేర్ ను ఉంచడం ప్రారంభించారు. ఈ సినిమాకు చెందిన 179 లింకుల్లో ఈ మాల్ వేర్ ఉంది. కాబట్టి కుదిరితే.. దీన్ని కూడా నెట్ ఫ్లిక్స్ లో నేరుగా చూడటానికి ప్రయత్నించండి తప్ప పైరసీలో చూడవద్దు అని టెక్ నిపుణుల అభిప్రాయం. కాదని ముందుకు వెళ్తే మీ విలువైన సమాచారం హ్యాకర్ల చేతికి వెళ్ళిపోయినట్టు
5జీ వార్.. పోటీ పడుతున్న మూడు కంపెనీలు.. ఔట్ కానున్న చైనా కంపెనీ? 5జీ వస్తే ఏమవుతుంది? అనారోగ్య సమస్యలు తప్పవా? సంచలనం స్రుష్టిస్తున్న తాజా వ...
అమెరికా లో జాబ్ వదిలేశాడు.. ఇండియా తిరిగి వచ్చి బిలియన్ డాలర్ కంపెనీ స్రుష్టించాడు.. ఎలా? ఏంటా బిజినెస్? ఇంతకీ ఎవరతడు? ఎందుకు అంత సాహసం చేశాడు? ఇలాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. "పీయూష్ బన్సాల్"...
0 Comments