5జీ వార్..
పోటీ పడుతున్న మూడు కంపెనీలు..
ఔట్ కానున్న చైనా కంపెనీ?
5జీ వస్తే ఏమవుతుంది?
అనారోగ్య సమస్యలు తప్పవా?
సంచలనం స్రుష్టిస్తున్న తాజా వాస్తవాలు..
దేశీయ టెలికాం రంగంలో 2జి, 3జి కంటే వేగంగా 4జి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు అంతే వేగంగా 5జి సేవలు అందించేందుకు వివిధ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. రిలయన్స్ జియో టెలికాం రంగంలోకి వచ్చినప్పటి నుంచి టెలికం కంపెనీల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. త్వరలో 5జీ సేవలు భారతదేశంలోకి అందుబాటులోకి రానున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ 5జీ అంటే ఏమిటి? ఏ టెలికం సంస్థలు ఈ సేవలను అందించనున్నాయి? 5జీ సేవలు అందుబాటులోకి వస్తే అనారోగ్య సమస్యలు పెరుగుతాయా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం....
5జి సేవలు విషయంలో పోటీ వాతావరణం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఈ పోటీలో ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, చైనాకు చెందిన హువావే ముఖాముఖిగా తలపడనున్నాయి. అయితే భారతదేశంలో హువావే ఇంకా 5జీలో చేరుతుందా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు. కానీ ప్రపంచ స్థాయిలో ఈ మూడు కంపెనీల మధ్య పోటీ విపరీతంగా ఉండనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికాం సంస్థ రిలయన్స్ జియో అమెరికాలో 5జీ సేవలను పరీక్షించింది. క్వాల్‌కామ్, రిలయన్స్ అనుబంధ సంస్థ రెడిసిస్‌తో కలిసి 5జి టెక్నాలజీపై కృషి చేస్తున్నామని, దీనిని త్వరలో భారతదేశంలో ప్రారంభించవచ్చని రిలయన్స్ జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఒమన్ ఇటీవల తెలిపారు. 5జీ సర్వీసులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలలో అందుబాటులో ఉన్నాయి.
క్వాల్‌కామ్ 1 జిబిపిఎస్‌కు మించిన వేగం సాధించినట్లు ఆమధ్య ప్రకటించింది. ప్రస్తుతం యుఎస్‌ఎ, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, జర్మనీ తదితర దేశాల 5జీ కస్టమర్లు 1 జిబిపిఎస్ ఇంటర్నెట్ స్పీడ్ సదుపాయాన్ని పొందుతున్నారు. మరోవైపు ఎయిర్‌టెల్ భారతదేశంలో 5జీ, హోమ్ బ్రాడ్‌బ్యాండ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇతర ఉత్పత్తులను అభివృద్ధి చేయడమే కాకుండా స్థానిక స్థాయి కాంట్రాక్ట్ తయారీదారులైన అమెరికాస్ ఫ్లెక్స్, భారతదేశ తేజాస్ నెట్‌వర్క్ వంటి పరికరాలను కూడా లక్ష్యంగా చేసుకుంది.
ఎయిర్‌టెల్ భారతదేశం ఆధారంగా ప్రత్యేకమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను అభివృద్ధి చేయాలనుకుంటోంది. దీని కోసం ఈ సంస్థ టెక్నాలజీ భాగస్వాములతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఈ ప్లాన్‌ల ద్వారా ఎయిర్‌టెల్ ఇతర టెలికాం కంపెనీలకు కూడా ఈ సేవలను అందించనుంది. స్థానిక 5జీ పర్యావరణ వ్యవస్థ ఎయిర్‌టెల్ సప్లయ్ చైన్‌ను బాగా నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది నెట్‌వర్క్ ఖర్చును కూడా తగ్గిస్తుంది. ఎయిర్‌టెల్ ప్రస్తుతం 5జీ పర్యావరణ వ్యవస్థ కోసం భాగస్వాములతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉంది. ఎయిర్‌టెల్ మొత్తం ప్రణాళిక రిలయన్స్ జియో 5జీ టెక్నాలజీతో పోటీ పడటమే. అయితే దేశంలో 5జీ సేవలను అందించే మొదటి సంస్థ తమదేనని జియో చెబుతోంది. జియో మొదట ఈ సేవలను భారతదేశానికి తరువాత ఆఫ్రికన్ మార్కెట్, పశ్చిమ ఆసియా, తూర్పు ఐరోపాకు తీసుకువెళ్లనున్నట్లు తెలిపింది. అదేవిధంగా ఎయిర్‌టెల్ ఆఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంకలో కూడా 5జీ నెట్‌వర్క్ అందించే దిశగా దృష్టి పెట్టింది.
వాస్తవానికి భారతదేశంలో ప్రభుత్వం 2021 సంవత్సరంలోనే 5జీ స్పెక్ట్రంను వేలం ద్వారా అందుబాటులో తేవాలని యోచిస్తోంది. దీని తర్వాత 2022 నుండి 5జీ సేవలను ప్రారంభించవచ్చని భావిస్తున్నారు. అమెరికాకు చెందిన మెవ్నిర్ సహా పలు కంపెనీలతో ఒప్పందం కోసం ఎయిర్‌టెల్ యోచిస్తోంది. అలాగే జపాన్‌కు చెందిన ఎన్‌ఇసి, తైవాన్‌కు చెందిన సర్కామ్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. దీంతో పాటు ఎయిర్‌టెల్‌కు ఇంతకుముందు ఎరిక్సన్, నోకియాతో భాగస్వామ్యం ఉంది.
అయితే భారతదేశంలో 5జీ ట్రయల్స్ ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. దీనికి ఇంకా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి అనుమతి రావాల్సివుంది. అంతకుముందు ఇది ఈ సంవత్సరం జనవరి నుండి మార్చి మధ్యలో జరుగుతుందని భావించారు. అదేవిధంగా చైనా కంపెనీలకు 5జీని ఆమోదించే విషయమై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. యుఎస్, జపాన్‌లోని కంపెనీలు తమ సొంత ఆర్ అండ్ డితో భారతదేశంలో 5 జీ నెట్‌వర్క్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి సహకరిస్తున్నాయి.
ఎయిర్‌టెల్ తన ఆర్‌అండ్‌డి ల్యాబ్‌ను 5జీ కోసం మానేసర్, బెంగళూరులలో ఏర్పాటు చేసింది. ఇందుకోసం సంస్థ వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. ప్రస్తుతం ఇందులో 100 మందికి పైగా ఇంజనీర్లు పనిచేస్తున్నారు. నోకియా, ఎరిక్సన్‌లతో కలిసి కోల్‌కతా, కర్నాటకలో 5జి ట్రయల్ చేస్తామని భారతీ ఎయిర్‌టెల్ ఇంతకుముందు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 5జీ మొబైల్ నెట్‌వర్క్‌లలో ప్రస్తుతం 330 కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. గ్లోబల్ మొబైల్ సప్లయర్స్ అసోసియేషన్ అంటూ జిఎస్‌ఎ ప్రకారం... 150 కంపెనీలు ప్రైవేట్ ఎల్‌టిఇ, 5జీ నెట్‌వర్క్‌లు, స్పెక్ట్రం ఉపయోగించడం ప్రారంభించాయి.
భారతదేశంలో ప్రధాన పోటీ రిలయన్స్, ఎయిర్‌టెల్ మధ్య ఉండనుంది. ఎందుకంటే చైనా సంస్థ హువావేను మన ప్రభుత్వం 5జీ సేవలకు దూరంగా ఉంచుతుందని భావిస్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా మాత్రం ఈ మూడు కంపెనీల మధ్య పోటీ ఉండనుంది. ఇక్కడ కూడా కొన్ని దేశాలలో హువావే ఆమోదం పొందడంలో సమస్యలు తలెత్తే అవకాశముంది. అందువల్ల ప్రధానంగా జియో, ఎయిర్‌టెల్ మధ్యే అసలమైన పోటీ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాకు కొన్ని దేశాలతో శత్రుత్వం ఉంది. కరోనా కారణంగా కొన్ని దేశాలు ఇటీవలే చైనా కంపెనీలను నిషేధించాయి. ఈ పరిస్థితిలో ప్రపంచ స్థాయిలో హువావే సంస్థ రాణించలేకపోవచ్చని అంటున్నారు.
ఇదిలావుంటే రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం మనకు ఎంత మంచి చేస్తుందో అంతకంటే ఎక్కువ చెడు కూడా చేస్తుంది. మనం ఇప్పుడు 4జీ నుండి 5 జీ నెట్‌వర్క్ మొబైల్ ఫోన్లు వాడే దశకు చేరుకుంటున్నాం. ఈ పరిణామం వల్ల ఆరోగ్యానికి హాని తప్పదు అని కొంత మంది పరిశోధకులు గట్టిగా వాదిస్తున్నారు. ఇప్పటికే ఈ 5జీ నెట్‌వర్క్‌ను విదేశాలలో ఉపయోగిస్తున్నారు. అయితే ఇండియాలో ఇంకా అందుబాటులోకి రాలేదు. 5 జి నెట్‌వర్క్ వల్ల ఆరోగ్యానికి, పర్యావరణానికి నష్టం తప్పదు అంటున్నారు. అయితే టెక్నాలజీ కంపెనీలు ఈ హెచ్చరికలను పట్టించుకోకుండా 5జీ నెట్ వర్క్ తమ ఫోన్లలో డివైజెస్‌లో అందుబాటులో ఉంచకపోతే మార్కెట్ లో ఎక్కడ వెనకబడిపోతామో అని భయపడుతున్నాయి. తమ అన్ని డివైజెస్ 5 జీటెక్నాలజీని సపోర్ట్ చేసే విధంగా ఇప్పటికే మార్పులు చేస్తున్నాయి.
హెల్త్ కి రిస్క్ ఉందని తెలిసినా ఈ 5 జీ నెట్‌వర్క్ ని వాడేందుకే యూజర్స్ ఇష్టపడుతున్నారు, దానికి కారణం ఈ నెట్వర్క్ అందించే హై స్పీడ్ సర్వీసెస్. వాహనాలకు సెల్ఫ్-డ్రైవింగ్ సిస్టం, వర్చువల్ రియాలిటీ ఇలా ఎన్నో అడ్వాన్స్డ్ ఫీచర్లకుకి 5జీ నెట్‌వర్క్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే అడ్వాన్స్డ్ సర్వీసెస్ అందించడానికి 5 జీ నెట్‌వర్క్ కి ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువ గానే వినియోగమవుతుంది. కాబట్టి ఇప్పుడు 5జీ సిగ్నల్స్ అందుకోవడానికి ఎక్కువ సామర్థం ఉండే యాంటెనాలు వాడాల్సి ఉంటుంది.
ఇప్పటికే సెల్‌ఫోన్ సిగ్నల్స్ కోసం మొబైల్ కంపెనీలు ఎక్కడపడితే అక్కడ యాంటెనాలు ఏర్పాటు చేశాయి. ఇప్పుడు 5 జీ నెట్వర్క్ కోసం మరిన్ని యాంటెనాలను ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఎక్కువ యాంటెనాలను పెట్టడం వల్ల ప్రజలు రేడియో తరంగాలకు గురయ్యే అవకాశాలు మరింతగా పెరుగుతాయి. మొబైల్ ఫోన్లను అతిగా ఉపయోగించేవారికీ, ఫోన్లను తలకు అతి దగ్గరగా ఎక్కువ సేపు పెట్టుకునే వారికీ క్యాన్సర్ సోకే అవకాశం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏనాడో తెలిపింది.
ఇదేవిధంగా ఈ హై ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాలను ఉపయోగించి తయారుచేసిన బొమ్మలు పిల్లల మానసిక సామర్థ్యంపై ప్రభావం చూపుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలాంటి పరికరాలు, ఫోన్లకు పిల్లలకు దూరంగా ఉంచాలని ఫ్రాన్స్‌కు చెందిన ఒక సేఫ్టీ ఏజెన్సీ సూచించింది. రేడియో తరంగాలకు ఎక్కువగా గురైనపుడు నిద్రలేకపోవడం , ఒత్తిడిలాంటి అనారోగ్య సమస్యలు ఎదువుతాయని వివిధ పరిశోధనల్లో తేలింది.
ఒకవైపు ఊరిస్తున్న స్జీ సేవలు మరోవైపు ఆరోగ్యసమస్యలు.. రెండిటిలో ఏది ముఖ్యం అనేది ప్రజలు తేల్చుకోవాలి.. ఏమంటారు?
అమెరికా లో జాబ్ వదిలేశాడు.. ఇండియా తిరిగి వచ్చి బిలియన్ డాలర్ కంపెనీ స్రుష్టించాడు.. ఎలా? ఏంటా బిజినెస్? ఇంతకీ ఎవరతడు? ఎందుకు అంత సాహసం చేశాడు? ఇలాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. "పీయూష్ బన్సాల్"...
ప్రస్తుతం ప్రపంచ వ్యాపార సామ్రాజ్యాన్ని శాసిస్తున్న “శామ్సంగ్ గ్రూప్” సక్సెస్ వెనుక ఓటమితో కుంగిపోయిన ఓ 27 ఏళ్ళ కుర్రాడు ఉన్నాడంటే మీరు నమ్మగలరా?. కానీ వాస్తవానికి ఇది నిజం. టెక్నాలజీతో పా...
0 Comments