సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ లో భారీగా డూప్లికేట్ అకౌంట్స్ ఉన్నట్లు అంతర్జాయ మీడియా పేర్కొంది. తాజాగా విడుదలైన సొసైల్ మీడియా వార్షిక నివేదిక ప్రకారం :
2019 డిసెంబర్ నాటికీ ఫేస్బుక్ లో 2.50 బిలియన్ల అకౌంట్స్ ఉండగా, వాటిలో 275 మిలియన్ డూప్లికేట్ అకౌంట్స్ ఉండవచ్చు ఈ నివేదిక అభిప్రాయపడింది.
2018తో పోల్చితే 2019లో భారీగా డూప్లికేట్ అకౌంట్స్ పెరిగినట్టు తెలుస్తుంది.
ఇండియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాలు అత్యధికంగా నకిలీ ఖాతాలను కలిగి ఉన్నాయి. ఫేస్బుక్ ప్రకారం, ఈ వినియోగదారులు తమ రెండు ఖాతాలను ఫేస్బుక్లో వేరు వేరుగా యాక్సిస్ చేస్తునట్టు తెలుస్తుంది.
ఒకే పేరుతో రెండు అకౌంట్లు :
మొదటి అకౌంట్ నిజమైన అకౌంట్ కాగా మరొకటి మాత్రం డూప్లికేట్ అకౌంట్స్ గా ఉన్నాయి.ఈ అకౌంట్స్ రెండు రకాలుగా వర్గీకరించారు. అవి :
1) పర్సనల్ అకౌంట్స్ 2) డూప్లికేట్ అకౌంట్స్ ని వ్యాపారాల కోసం వినియోగిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ రెండు వర్గాలలోని ఖాతాలు ఫేస్బుక్ లోనే ఉండటంతో ఫేక్ అకౌంట్స్ ని కనిపెట్టడం సాధ్యం కావడం లేదు. ప్రస్తుతం తెలిపిన నకిలీ లేదా నకిలీ ఖాతాల సంఖ్య అంతర్గత సమీక్షల ఆధారంగా ఉంటుంది అని ఈ నివేదికలో తెలిపింది. నకిలీ ఖాతాల సంఖ్య వాస్తవానికి ఎక్కువుగా ఉండే అవకాశం ఉంది.
ఈ డూప్లికేట్ అకౌంట్స్ ద్వారా ఫేక్ న్యూస్ తో పటు ఫిషింగ్ లింక్స్ ని కూడా షేర్ చేస్తూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారు.
ప్రభుత్వం కొత్త నిబంధనలు :
భారత ప్రభుత్వం నకిలీ వార్తలను నియంత్రించేందుకు కఠిన చట్టాలిని తీసుకురావడానికి సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది.
5జీ వార్.. పోటీ పడుతున్న మూడు కంపెనీలు.. ఔట్ కానున్న చైనా కంపెనీ? 5జీ వస్తే ఏమవుతుంది? అనారోగ్య సమస్యలు తప్పవా? సంచలనం స్రుష్టిస్తున్న తాజా వ...
అమెరికా లో జాబ్ వదిలేశాడు.. ఇండియా తిరిగి వచ్చి బిలియన్ డాలర్ కంపెనీ స్రుష్టించాడు.. ఎలా? ఏంటా బిజినెస్? ఇంతకీ ఎవరతడు? ఎందుకు అంత సాహసం చేశాడు? ఇలాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. "పీయూష్ బన్సాల్"...
0 Comments