శని గ్రహం శతాబ్దాలుగా మానవులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. విశ్వ అన్వేషణలో భాగంగా మానవుడు ఇప్పటి వరకు 4,187 గ్రహాలను కనుక్కున్నాడు. అయినా మానవ మేధస్సుకు అసలైన సవాళ్ళను విసిరిన ఏకైక గ్రహం “శని గ్రహం” మాత్రమే. శని గ్రహం సూర్యుడు నుండి ఆరవ స్థానంలో ఉంది. సౌర వ్యవస్థలో బృహస్పతి తరువాత రెండవ అతిపెద్ద గ్రహం శని మాత్రమే. శనిగ్రహం శాస్త్రవేత్తలను ఇంతగా ఆశ్చర్య పెట్టడానికి ముఖ్య కారణం దాని రింగ్స్ . శనిగ్రహం చుట్టూ వలయాకారంలో కొన్ని రింగ్స్ తిరుగుతూ ఉన్నాయి.
అసలు ఈ వలయాలు ఎలా ఏర్పడ్డాయి ? ఎందుకు ఆ రింగ్స్ శనిగ్రహం వద్ద తిరుగుతున్నాయినే సందేహం శాస్త్రవేత్తలను ఎప్పటి నుండో వేధిస్తుంది. మన సౌర వ్యవస్థలో 8 గ్రహాలు ఉన్నాయి. భూమికి చంద్రుడు ఏకైక ఉపగ్రహం ఉంది. కానీ శనిగ్రహం 63 కు పైగా ఉపగ్రహాలను కలిగి ఉంది. సింపుల్ గా చెప్పాలంటే శనిగ్రహం “మినీ సోలార్ సిస్టం” గా చెప్పవచ్చు. శనిగ్రహం యొక్క రహస్యాలను చేధించడానికి మానవుడు దశాబ్ద కాలంగా ప్రయత్నిస్తున్నాడు.
ఈ క్రమంలో “క్యాసిని -హ్యూజెన్స్” అనే స్పేస్ తో మనిషి మరో ముందు అడుగు వేసాడు. అసలు “క్యాసిని -హ్యూజెన్స్” అంటే ఏమిటి ? శనిగ్రహంలో దాగి ఉన్న ఆ రహస్యాలు ఏమిటి ? ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలపడానికి “క్యాసిని -హ్యూజెన్స్ 1997” అనే సరికొత్త వీడియోతో “న్యూస్ 6జి” మీ ముందుకు వచ్చింది. ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం....
1655 లో డచ్ ఖగోళ శాస్త్రవేత్త క్రిస్టియాన్ హ్యూజెన్స్ శని గ్రహం యొక్క వలయాలను మొట్టమొదటి సారిగా వివరించాడు. 1610 లో ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో గెలీలి తన టెలిస్కోప్ సహాయంతో శని గ్రహం వలయాలను నిర్దారించాడు. తరువాత కాలంలో ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త “గియోవన్నీ కాస్సిని” శని యొక్క నాలుగు ఉపగ్రహాలను గుర్తించి, వాటిని విభజించాడు..
శనిగ్రహం మీద పరిశోధనల కోసం 1980 సంవత్సరం ప్రారంభంలో, పయనీర్ 11 మరియు వాయేజర్ 1 మరియు 2 అనే మూడు ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు ప్రయోగించారు. వీటి డేటా విశ్లేషణ చేసిన శాస్త్రవేత్తలకు,అనేక కొత్త సందేహాలు రావడం మొదలయ్యాయి. దీనితో శనిగ్రహం పై కంప్లీట్ స్టడీస్ కోసం లాంగ్ టర్మ్ “సాటర్న్” రీసెర్చ్ ను శాస్త్రవేత్తలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా 1989 వ సంవత్సరంలో నాసా, మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) మరియు ఇటాలియన్ స్పేస్ ఏజెన్సీ (ASI) లు సంయుక్తంగా ఒక జాయింట్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసాయి. ఈ ప్రాజెక్ట్ కు”క్యాసిని -హ్యూజెన్స్ 1997” అని పేరు పెట్టారు. దీనిలో భాగంగా "క్యాసిని -హ్యూజెన్స్” అనే స్పేస్ క్రాఫ్ట్ ను శని గ్రహం వద్దకు పంపడానికి శాస్త్రవేత్తలు సిద్ధం అయ్యారు.
లాస్ట్ 50 ఇయర్స్ లో నాసా డెవలప్ చేసిన మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ లాంగ్ టర్మ్ స్పేస్ క్రాఫ్ట్ “క్యాసిని -హ్యూజెన్స్” మాత్రమే. ప్రపంచంలోని 27 దేశాలతో కలిసి నాసా ఈ ప్రాజెక్ట్ ను లాంచ్ చేసింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ ను అక్టోబర్ 15,1997 లో “టైటాన్ 401బి హెవీ పేలోడ్ రాకెట్ తో నాసా ఈ ప్రయోగం చేసింది. ఇందులో హ్యూజెన్స్ అనే స్పేస్ క్రాఫ్ట్ తో పాటు క్యాసిని అనే ఆర్బిటర్ ఉంది. క్రిస్టియాన్ హ్యూజెన్స్ శని గ్రహం యొక్క వలయాలను కనుక్కోవడంతో, స్పేస్ క్రాఫ్ట్ కు హ్యూజెన్స్ అని, గియోవన్నీ కాస్సిని శనిగ్రహం యొక్క ఉపగ్రహాలను గుర్తించడంతో వారి జ్ఞాపకార్ధం, ఆర్బిటర్ కు క్యాసిని అని పేరు పెట్టారు.
శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయడానికి మరో కారణం ఉంది. ఫ్యూచర్ లో భూమి నాశనం అవ్వడం తథ్యం, ఈ క్రమంలో మరో గ్రహం మీద మనుగడ కోసం పోరాటం చేయక తప్పదు.అటువంటి గ్రహాల అన్వేషణ కోసం నాసా ఈ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసింది. 1997లో స్టార్ట్ అయినా ఈ ప్రాజెక్ట్ ,శని గ్రహన్నీచేరుకోవటానికి 7 సంవత్సరాలు సమయం పట్టింది. 2008 లో ఇస్రో చంద్రయాన్-1 ప్రోబ్ చంద్రుడు నీటి జాడలను గుర్తించింది. అప్పటికే క్యాసిని-హ్యూజెన్స్ సెండ్ చేసిన డేటా, చంద్రయాన్-1 డేటా ఒకే విధంగా ఉండటంతో చంద్రుడు మీద నీళ్లు ఉన్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అక్టోబర్ 31, 2002 నుండి శనిగ్రహం కక్ష్యలో క్యాసిని -హ్యూజెన్స్ తిరగడం ప్రారంభింది. డిసెంబర్ 24, 2004 న, హ్యూజెన్స్ స్పేస్ క్రాఫ్ట్ నుండి క్యాసిని విడిపోయింది. జనవరి 14, 2005 న క్యాసిని, టైటాన్ ఉపగ్రహంలోని దట్టమైన వాతావరణంలోకి ప్రవేశించింది.
అయితే ఇక్కడే అసలైన విషయం బయటపడింది. ఈ ప్రయాణంలో హ్యూజెన్స్ “ఎన్సులడాస్” అనే ఉపగ్రహాన్ని కనుక్కుంది. ఈ ఉపగ్రహం 91% మంచుతో కప్పబడివుంది. ఎన్సులడాస్ గ్రహంలో భూమిలానే నీరు, పర్వతాలు, నదులు ఉన్నాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఎన్సులడాస్ ఉపగ్రహం మీద నీటితో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఈ గ్రహం తనలోని నీటిని విశ్వంలోకి వెదజల్లుతోంది. అంటే కుళాయి నుండి నీళ్లు ఎలా బయటకు పంపు చేయబతాయో, అదే విధంగా ఎన్సులడాస్ నీటిని స్పేస్ లోకి వెదజల్లుతోంది. ఎన్సులడాస్ గ్రహం మీద - 190 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. మన భూమీద ఉన్నఅంటార్కిటిక కంటే, రెండు రేట్లు ఎక్కవ ఉష్ణోగ్రతలు అక్కడ ఉన్నాయి. ధీనితో శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు,
సౌర కుటుంబంలో మనిషి నివసించడానికి అనువైన ఉపగ్రహాని గుర్తించాం అని ప్రకటించారు. ఇక్కడ నీరు ఉండటంతో, జీవులు బ్రతకడం కష్టం కాదు. అప్పటికే క్యాసిని తన ప్యారాచూట్ సహాయంతో టైటాన్ మీద సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. సోలార్ సిస్టంలో మనిషి తయారు చేసిన మొట్టమొదటి హ్యూమన్ మేడ్ ఆబ్జెక్ట్, ఒక ఉపగ్రహం మీద ల్యాండ్ అవ్వడం అదే ఫస్ట్. మరో వైపు శనిగ్రహం చుట్టూ తీరుతున్న “హ్యూజెన్స్” సరి కొత్త విషయాలను ఎప్పటికప్పుడు భూమికి చేరవేస్తూనేవుంది. దీని ప్రకారం: ప్రస్తుతం శనిగ్రహం చుట్టూ, ఉన్న వలయాలు కొత్తగా ఏర్పడినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది.ప్రపంచంలో అణుఇంధనంతో నడిచే మొదటి స్పేస్ క్రాఫ్ట్ “క్యాసిని -హ్యూజెన్స్” మాత్రమే. ఏప్రిల్ 26, 2017 లో అసలైన ఘట్టం మొదలైంది. హ్యూజెన్స్ ను శనిగ్రహం లోపలి ప్రవేశపెట్టాలని శాస్తవేత్తలు నిర్ణయించుకున్నారు. కానీ ఇక్కడే అసలైన సమస్య దాగి ఉంది. శనిగ్రహంలోకి ప్రవేశించాలి అంటే, దాని చుట్టు ఉన్న 3 వలయాలు దాటి లోపలికి వెళ్ళాలి. హ్యూజెన్స్ ఆ సవాళ్ళను స్వీకరించింది.3 రింగ్స్ ని 27 డైవ్స్ తో సక్సెస్ ఫుల్ కంప్లీట్ చేసి శనిగ్రహానికి చెరువుగా చేరుకుంది. అప్పటికే హ్యూజెన్స్ ఇంధనం పూర్తిగా అయిపోటంతో, నాసా సెప్టెంబర్ 15, 2017 న హ్యూజెన్స్ ను శనిగ్రహం వాతావరణంలోకి ప్రవేశపెట్టి, మండిపోయేలా చేసారు. అంతటితో క్యాసిని -హ్యూజెన్స్ ప్రయాణం ముగిసింది.
5జీ వార్.. పోటీ పడుతున్న మూడు కంపెనీలు.. ఔట్ కానున్న చైనా కంపెనీ? 5జీ వస్తే ఏమవుతుంది? అనారోగ్య సమస్యలు తప్పవా? సంచలనం స్రుష్టిస్తున్న తాజా వ...
అమెరికా లో జాబ్ వదిలేశాడు.. ఇండియా తిరిగి వచ్చి బిలియన్ డాలర్ కంపెనీ స్రుష్టించాడు.. ఎలా? ఏంటా బిజినెస్? ఇంతకీ ఎవరతడు? ఎందుకు అంత సాహసం చేశాడు? ఇలాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. "పీయూష్ బన్సాల్"...
0 Comments