చైనా కు చెందిన కంఫ్యూజియస్ అనే తత్వవేత్త మస్తిష్కం నుండి జాలువారిన అనేక జీవిత సూత్రాలు మానవసమాజాన్ని తర తరాలుగా కదిలిస్తూనే ఉన్నాయి.. అలాంటి Confucius quotes in telugu కు సంభందించి కొన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం..
మన అందరికీ రెండు జీవితాలు ఉంటాయి.. కానీ మనకు ఒక జీవితమే ఉందని గుర్తించినప్పుడే రెండవది మొదలవుతుంది..
ఇతరులనుండి నీవు కోరుకునే మర్యాదనే వారికి ఇవ్వు..
సమస్య ఎదురైనప్పుడు మౌనం కంటే మాటలే ఎక్కువ పనిచేస్తాయి అని అనుకున్నప్పుడే మనం మాట్లాడాలి..
మనలోని గొప్పదనం మనకెదురైన పరిస్థితులను ఎదుర్కోవడం లో దాగి ఉంది..
ఇంతవరకూ నువ్వు గాల్లో మేడలు కట్టి ఉంటే పరవాలేదు.. వాటిని అలాగే ఉండనివ్వు.. కానీ ఇప్పటికైనా వాటికింద పునాది నిర్మించడం మొదలుపెట్టు..
నిన్ను నువ్వు గౌరవించుకుంటే ఇతరులు నిన్ను తప్పక గౌరవిస్తారు..
రెండు కుందేళ్ళను వేటాడే వాడు దేన్నీ పట్టుకోలేడు..
నీవు వద్దు అనుకున్నది ఇంకొకరిపై బలవంతంగా రుద్దకు..
ఒక సింహం నన్ను చెట్టుపైకి తరిమింది.. అక్కడనుండి ప్రక్రుతి అందాలు ఎంతో అందంగా కనిపించాయి..
ప్రతి ఒక్క దానిలో అందం దాగి ఉంటుంది.. అందరూ దాన్ని చూడలేరు..
పర్వతాన్నే కదిలించాలని భావించే వాడు చిన్న చిన్న రాళ్ళను మొదట తీసుకెళ్తాడు..
ఈ inspirational quotes in telugu చాలా ఆశక్తికరంగా ఉన్నాయి కదా? మరికొన్ని Confucius quotes in telugu ఇప్పుడు చూద్దాం..
చిరునవ్వును మించిన అందం.. వినయాన్ని మించిన ఆభరణం మరొకటిలేదు..
వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అగ్నానిగానే మిగిలిపోతాడు..
చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిలాగే మిగిలిపోతాడు..
నేను చెయ్యగలను అని అనేవాడు.., నేను చెయ్యలేను అని అనేవాడూ ఇద్దరూ కరెక్టే..
ఒక వ్యక్తి తన సందేహాన్ని వెలిబుచ్చడం ద్వారా ఆ కొద్దిసేపు మాత్రమే ఒక ఫూల్ గా చెప్పబడతాడు.. కానీ అదే ప్రశ్న అడగకుండా ఉండడం వల్ల అతడు జీవితకాలం ఒక ఫూల్ లా బ్రతుకుతాడు..
నీ ప్లాన్ ఒక ఏడాది కోసం ఐతే ఒక వరి మొక్కను నాటు..
నీ ప్లాన్ ఒక పదేళ్ళకోసం ఐతే ఒక వ్రుక్షాన్ని నాటు..
అదే నీ ప్లాన్ ఒక తరం కోసం ఐతే నీ పిల్లలకు మంచి చదువు చెప్పించు..
అన్ని విద్యలూ నేర్చిన వాడు మరియు ఆలోచన లేని వాడు ఓడిపోక తప్పదు.. అదే సమయం లో ఒకడు బాగా ఆలోచించే వాడు మరియు విద్యలు నేర్వని వాడు అత్యంత ప్రమాదకరం..
నీవు ఒక గదిలో ఉన్న అందరికన్నా తెలివైనవాడివైతే నువ్వు ఆ రూం లో ఉండడం సరికాదు..
జీవితం నిజానికి ఎంతో సులభమైనది.. మనమే దాన్ని కష్టాలపాలు చేసుకుంటాము..
భూత కాలాన్ని ఒక్కసారి చదువు.. భవిష్యత్ ఎంతో అందంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది..
నేను వింటాను - మర్చిపోతాను..
నేను చూస్తాను - గుర్తుపెట్టుకుంటాను...
నేను చేస్తాను - అర్ధం చేసుకుంటాను...
బాగా తెలివైన వారు, అత్యంత వెధవలు ఇద్దరూ ఎన్నటికీ మారడానికి ఇష్టపడరు..
అసహ్యించుకోవడం చాలా సులభం - ప్రేమించడం చాలా కష్టం.. అదే విధంగా మంచి మంచి పనులు చెయ్యడం చాలా కష్టం - చెడు పనులు చెయ్యడం చాలా సులభం..
ఒకరిని మరొకరు ప్రేమించండి.. ఇది మీకు పనిచెయ్యకపోతే మరొకరిని ప్రేమించండి..
ఇలా ఆశక్తికర Confucius telugu quotes మరికొన్ని మరో టాపిక్ లో తెలుసుకుందాం..
మరిన్ని
మనజీవితాలు .. జిడ్డు కృష్ణమూర్తి అర్థాలు .. మానవ సంబంధాలు, మానసిక తిరుగుబాటు, సమాజంలో రావాల్సిన మార్పుల గురించి ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి చేసిన ప్రసంగాలు, రచనలు ప్రపంచవ్య...
- నాయకుల్లో మూడు రకాలు.. సింహం, పులి, చిరుత.. - రాచఠీవికి, గంభీరమైన నాయకత్వానికి సింహం ప్రతీక.. - తెలివైన, బలమైన, ముందుచూపున్న లీడరంటే ..పులే.. - వేగం, నైపుణ్యం గల పారిశ్రామిక వేత్త ..చిరుత.. నాయక...
0 Comments